సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్ | Arjun Sarja Responds Udhayanidhi Stalin Sanatan Dharma | Sakshi
Sakshi News home page

Arjun Sarja: మీ అమ్మనాన్నని తిరస్కరించగలవా? సనాతన ధర్మం అలానే

May 29 2026 12:39 PM | Updated on May 29 2026 12:43 PM

Arjun Sarja Responds Udhayanidhi Stalin Sanatan Dharma

గత కొన్నాళ్ల నుంచి సనాతన ధర్మం అనే టాపిక్ ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతెందుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగానూ ఇదే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)

ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై నటుడు అర్జున్ సర్జా ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు జీవన విధానం. అది తల్లిదండ్రులని దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. మీరు మీ సొంత తల్లిదండ్రులని తిరస్కరించగలరా? లేదు కదా.. అధే విధంగా సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు' అని అర్జున్ చెప్పుకొచ్చాడు.

ఇతడు హీరోగా నటించిన 'బ్లాస్ట్' మూవీ నిన్న(మే 28) తెలుగు, తమిళంలో రిలీజైంది. దీని సక్సెస్ మీట్ చెన్నైలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ డీఎంకే నేత ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అర్జున్ విషయానికొస్తే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మైసూరుకి చెందిన ఈయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 180కి పైగా సినిమాల్లో నటించారు. హీరో అనే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గానూ పలు బాధ్యతల్ని నిర్వహించారు. వరస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు విషయాలపై తన అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు అలానే సనాతన ధర్మం గురించి మట్లాడారు.

(ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement
 
Advertisement
Advertisement