breaking news
House Warming Ceremony
-
రూ.350 కోట్ల విలువైన బంగ్లా.. గృహప్రవేశం ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్ (ఫొటోలు)
-
10 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్!
సిటీలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 50 లక్షలైనా అవుతుంది. కానీ 10 లక్షల రూపాయలకే రెండు పడకల ఫ్లాట్.. అది కూడా నగరంలో అంటే ఆశ్చర్యం కలగమానదు. ఇంత తక్కువకి ఎక్కడ అమ్ముతున్నారని అనుకుంటున్నారా? ప్రభుత్వమే కట్టించి, ముఖ్యమంత్రే స్వయంగా మీకు ఇంటి తాళాలు అప్పగిస్తే..! ఏంటి నమ్మడం లేదా? అయితే పదండి.. ఆ వివరాలు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణివేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇలాంటి చర్యల్లో భాగంగా మాఫియా నాయకుడు ముఖ్తార్ అన్సారీ.. లక్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో ఆక్రమించిన సుమారు 2,322 చదరపు మీటర్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో పేదలకు ఇళ్లు నిర్మించింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ స్కీమ్ (Sardar Vallabhbhai Patel Housing Scheme) కింద లక్నో డెవలప్మెంట్ అథారిటీ (LDA) ఈ ఫ్లాట్లను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో మూడు G+3 బ్లాక్‌లలో 72 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కొ ఫ్లాట్ 36.65 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో ఫ్లాట్ ధర ₹10.70 లక్షలు. ఈ గృహ సముదాయంలో స్వచ్ఛమైన నీరు, విద్యుత్, సెక్యురిటీ, ద్విచక్ర వాహన పార్కింగ్ ,రోడ్లు, పార్కులు వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి.అక్రమార్కుల ఆటలు సాగవుకార్తీక పౌర్ణమి రోజున సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ గృహ సముదాయం ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను చెరబట్టిన అక్రమార్కుల ఆట కట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. "ఇది కేవలం ఇళ్ల పంపిణీ కార్యక్రమం కాదు, ఒకప్పుడు మాఫియా ఆక్రమించిన భూమిలో ఇప్పుడు పేదలు ఇళ్లు దక్కాయనే సందేశం ఇది. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పేదలను దోపిడీ చేసే వారి ఆటలు ఉత్తరప్రదేశ్‌లో ఇకపై సాగబోవు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడటానికి మా ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది. ఇది నూతన భారతదేశం, ఉత్తరప్రదేశ్ యొక్క గుర్తింపు. ఇక్కడ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలతో కలిసి అభివృద్ధి నడుస్తుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన లక్నోలో మాఫియా లేని భూమిలో లబ్ధిదారులకు గృహాలను అందించడం నిజంగా గర్వకారణమ''ని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.చదవండి: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంఒక్కో ఫ్లాట్ విలువ రూ. కోటి!గృహ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా బహుమతులు పంపిణీ చేశారు. నివాసితుల పిల్లలతో అప్యాయంగా మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచారు. నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. కాగా, లక్నోలోని ప్రైమ్ ఏరియాలో నిర్మించిన ఈ ఫ్లాట్లను దక్కించుకునేందుకు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,700 మంది అర్హులని గుర్తించారు. వీరిలో 72 మంది ఫ్లాట్లను దక్కించుకున్నారు. ఒక్కో ఫ్లాట్ విలువ మార్కెట్ ధర ప్రకారం దాదాపు కోటి రూపాయలకు వరకు ఉంటుందని సీఎం యోగి చెప్పారు. संदेश स्पष्ट है...अगर गरीबों की व किसी सार्वजनिक भूमि पर कब्जा कर समाज को धमकाने का कार्य करोगे तो लेने के देने पड़ जाएंगे।आज लखनऊ में माफिया से मुक्त कराई गई भूमि पर दुर्बल आय वर्ग के 72 परिवारों के लिए निर्मित फ्लैट के आवंटन-पत्र का वितरण किया। इस अवसर पर सरदार वल्लभ भाई… pic.twitter.com/gNmE1FXvzT— Yogi Adityanath (@myogiadityanath) November 5, 2025 -
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తెలుగు సినిమాల్లో కమెడియన్, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్లోనూ పాల్గొంది గానీ ఒకటి రెండు వారాలు కూడా హౌస్‌లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. గత కొన్నాళ్లలో పెద్దగా మూవీస్‌లో కనిపించని ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!)ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది. చివరగా 2020లో వచ్చిన 'గోల గోల' అనే చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా 2017లో మొదలైన బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రీసెంట్ టైంలో అయితే ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోల్లో కనిపించింది అంతే.చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది. దీంతో జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మెడలో నెక్లెస్‌తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..) -
యాంకర్ లాస్య గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా రోజా (ఫోటోలు)
-
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్‌బాస్ మానస్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన మానస్ (Maanas Nagulapalli) తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో బాగా పాపులర్ అయ్యాడు. అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్‌గా ఆడి, నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్‌లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది. మానస్‌కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ, డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది.గృహప్రవేశంతాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది. కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.సినిమానరసింహ నాయుడు, వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్.. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం వంటి చిత్రాలు చేశాడు. కొన్నాళ్లకు తెలుగులో బిగ్‌బాస్ 5వ సీజన్లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విజేత కాలేకపోయాడు. బిగ్‌బాస్ నుంచి రాగానే కార్తీకదీపం సీరియల్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7) చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి -
జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)
-
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
-
కొత్తింట్లో అడుగుపెట్టిన 'మసూద' హీరో (ఫోటోలు)
-
కొత్తింట్లో అడుగుపెట్టిన వాషింగ్టన్ సుందర్.. గృహ ప్రవేశం (ఫొటోలు)
-
తెలుగు యూట్యూబర్ సృజన సాగర్ నూతన గృహప్రవేశం.. టాలీవుడ్ బుల్లితెర తారల సందడి (ఫోటోలు)
-
వితికా షెరు చెల్లిని చూశారా? భర్తతో గృహప్రవేశం (ఫోటోలు)
-
Lasya Chittella: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గృహప్రవేశం (ఫోటోలు)
-
ప్రముఖ బుల్లితెర నటి గౌరి శృతి నూతన గృహ ప్రవేశం.. పాల్గొన్న సినీతారలు (ఫొటోలు)
-
చదువు పూర్తవగానే కొత్తిల్లు కొన్న డ్యాన్సర్.. గృహప్రవేశం (ఫోటోలు)
-
ప్రముఖ బుల్లితెర నటి అక్షత నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
కోలీవుడ్ బుల్లితెర నటి మణి మేఘలాయి నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
కొత్త కోడలిగా నటి గృహప్రవేశం, ముచ్చటైన వేడుక (ఫోటోలు)
-
న్యూ బిగినింగ్.. యాంకర్ రవి గృహప్రవేశ వేడుక (ఫోటోలు)
-
పశ్చిమగోదావరి జిల్లా : తణుకు లో గృహప్రవేశం చేసిన జబర్ధస్త్ నటి సత్య శ్రీ (ఫొటోలు)
-
న్యూజర్నీ: దీపావళి వేళ నటి గృహప్రవేశ వేడుక (ఫొటోలు)


