
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన మానస్ (Maanas Nagulapalli) తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో బాగా పాపులర్ అయ్యాడు. అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్‌గా ఆడి, నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్‌లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది. మానస్‌కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ, డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది.

గృహప్రవేశం
తాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్‌వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది. కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.
సినిమా
నరసింహ నాయుడు, వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్.. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం వంటి చిత్రాలు చేశాడు. కొన్నాళ్లకు తెలుగులో బిగ్‌బాస్ 5వ సీజన్‌లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విజేత కాలేకపోయాడు. బిగ్‌బాస్ నుంచి రాగానే కార్తీకదీపం సీరియల్‌లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు.