
బుల్లితెర నటి హర్షిక వెంకటేశ్ (Harshitha Venkatesh) గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి బేబీ ఆన్ ద వే అంటూ ఓ వీడియో షేర్ చేసింది. పెళ్లయిన ఐదేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నాం.. ఇద్దరం కాస్తా ముగ్గురం కాబోతున్నామంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇస్మార్ట్ జోడీ విన్నర్స్
హర్షిక.. లక్ష్మీ కల్యాణం, అమ్మ కోసం సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించింది. భర్త వినయ్ శ్యామ్‌సుందర్‌తో కలిసి ఇస్మార్ట్ జోడీ సీజన్ 2లో పాల్గొంది. పలుసార్లు ఎలిమినేషన్ అంచులవరకు వెళ్లొచ్చిన వీరు ఫినాలేలో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు జంటగా టాస్కులు గెలిచి ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 విన్నర్స్‌గా నిలిచారు. విజేతలుగా ట్రోఫీ అందుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ సెలబ్రిటీ జంట కన్నడలో రాజారాణి రీలోడెడ్ అనే షోలోనూ పాల్గొన్నారు. ఈ షోలో ఫైనల్స్‌వరకు వెళ్లగలిగారు.
చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్ చేశారా?