
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj ) కొత్త ఇంటి కలను పూర్తిచేసుకుంది. గృహ ప్రవేశం ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది

సీతారామాంజనేయ కృపతో పాటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదానికి తోడుగా మీ అందరి ప్రేమ వల్ల మా జీవితంలో ఇది మరో అధ్యాయమని ఆమె పేర్కొంది

కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరును అనసూయ ఎంపిక చేసుకున్నారు

తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లో పాలు పొంగించి గృహ ప్రవేశం చేసింది. సుమారు 20 ఏళ్లుగా ఎన్నో షోలతో మెప్పించిన అనసూయ యూత్‌ని బాగా ఆకట్టుకున్నారు

బుల్లితెరకి గుడ్ బై చెప్పేసి, సినిమాలకు మాత్రమే ఆమె పరిమితం అయ్యారు

పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కష్టపడిన అనసూయ.. హైదరాబాద్‌లో ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. అనసూయకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.











