తెలుగు సినిమాల్లో కమెడియన్, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్‌లోనూ పాల్గొంది గానీ ఒకటి రెండు వారాలు కూడా హౌస్‌లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. గత కొన్నాళ్లలో పెద్దగా మూవీస్‌లో కనిపించని ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!)
ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది. చివరగా 2020లో వచ్చిన 'గోల గోల' అనే చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా 2017లో మొదలైన బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రీసెంట్ టైంలో అయితే ఒకటి రెండు ఎంటర్‌టైన్‌మెంట్ రియాలిటీ షోల్లో కనిపించింది అంతే.
చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది. దీంతో జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: మెడలో నెక్లెస్‌తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..)


