ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు, హీరో శిరీష్ (Allu Sirish) ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనిక వేలికి ఉంగరం తొడిగాడు. అక్టోబర్ 31న ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అతడు వైట్ డ్రెస్సులో మెడకు నెక్లెస్‌తో కనిపించాడు. అటు నయనిక ఎరుపు రంగు లెహంగాలో, ముత్యాల దండతో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శిరీష్ లవ్‌స్టోరీ
అల్లు శిరీష్‌కు పెళ్లి చేయాలని అరవింద్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, శిరీష్ ఓకే చెప్పాలిగా! అలాంటి సమయంలో (2023లో) వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఈ జంట కోసం హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.
శిరీష్ జర్నీ
'గౌరవం' (2013) సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులే అందుకోవడంతో సినిమాలు తగ్గించేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి ఏ సినిమా రాలేదు.
చదవండి: నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్


