అమ్మకు క్యాన్సర్ వస్తే జ్వరం అనుకున్నా.. నాన్న బుర్ర చెడిపోయింది | Tejaswi Madivada About Her Childhood And Mother Father Relation | Sakshi
Sakshi News home page

Tejaswi Madivada: 18 ఏళ్లు పూర్తవగానే ఇంటినుంచి బయటకొచ్చేశా

May 29 2026 3:19 PM | Updated on May 29 2026 3:29 PM

Tejaswi Madivada About Her Childhood And Mother Father Relation

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో నటిగా మారి తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన తేజస్వి మదివాడ.. తర్వాత ఆర్జీవీ తీసిన 'ఐస్‌క్రీమ్'లో హీరోయిన్‌గా చేసింది. తెలుగు బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తన చిన్నతనం ఎంత దారుణంగా ఉండేది అనే విషయాల్ని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)

'మా అమ్మనాన్న ఎప్పుడు పెళ్లిచేసుకోలేదు. నాన్న కాలేజీలో, అ‍మ్మ స్కూల్‌లో ఉన్నప్పుడు కిరికిరి పనిచేశారు. దీంతో అమ్మ ప్రెగ్నెంట్ అయింది. అప్పటికే మా నాన్న.. ఆర్మీలో జాయిన్ అయిపోయారు. దీంతో ఇంటి నుంచి బయటకొచ్చేసిన అమ్మ.. బిహార్‌లో ఉన్న నాన్న దగ్గరకు వెళ్లిపోయింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేదంటే చనిపోతానని భయపెట్టింది. దీంతో దగ్గరలోని ఓ గుడికి వెళ్లారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. నాకంటే ఐదేళ్ల పెద్దోడైన అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య తర్వాత ముగ్గురు బిడ్డలు చనిపోయారు. తర్వాత ఆమె గర్భంతో ఉన్నప్పుడు 7 నెలలకే నేను పుట్టేశాను'

'నేను మూడు నాలుగేళ్లన్నప్పుడు మేం సింగరేణిలో ఉన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్ రావడం నాకు గుర్తుంది. బీహెచ్ఈఎల్‌లో చదువుకున్నాను. నేను స్కూల్ చదువుతున్న టైంలో అమ్మకు క్యాన్సర్ వచ్చింది. అబార్షన్స్ వల్ల ఆమె శరీరంలో పాలు ఉండిపోవడంతో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. నాలుగో స్టేజీలో ఉన్నప్పుడు ఈ వ్యాధి గురించి మాకు తెలిసింది. ఇదంతా నాకు ఆరేడేళ్లు ఉన్నప్పుడు జరిగింది. క్యాన్సర్ గురించి చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది. నేను అది జ్వరం అనుకున్నా. చావు చూసేంతవరకు ఎవరికైనా దాని గురించి తెలియదు. నాకు పదకొండేళ్లు ఉన్నప్పుడు ఓ రోజు అమ్మ చనిపోయింది. దీంతో అప్పటినుంచి నా జీవితం సీరియస్ అయిపోయింది'

'నేను ఇప్పుడేం ఇండిపెండెంట్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఇలానే పెరిగాను. అయితే మా నాన్న బుర్ర చెడిపోయింది. మరి అమ్మ చనిపోవడం వల్లో ఏమో గానీ తాగుడుకు బానిస అయిపోయాడు. దీంతో ఇంట్లో నా పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో నాన్నని చూడటానికే భయపడి బెదిరిపోయేదాన్ని. 18 ఏళ్లొస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నాకు పన్నెండుపదమూడేళ్లు ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను. ఇదంతా నాకు నేను చెప్పుకొనేదాన్ని. అలా ఎదురుచూసి 18 ఏళ్లు పూర్తవగానే ఇంటినుంచి బయటకొచ్చేశాను. ఇవన్నీ క్యాజువల్‌గా చెబుతున్నాను గానీ నా జీవితంలో చాలా బాధాకరమైన విషయాలు ఇవి'

'ఇంటినుంచి బయటకొచ్చేసిన తర్వాత రెండున్నరేళ్లు అనాథశ్రమంలో పెరిగాను. ఆ టైంలో నాకు తిండి పెట్టడంతో పాటు చదువుకు అయ్యే ఖర్చంతా వాళ్లు భరించారు. దీంతో డ్యాన్స్ టీచర్‌గా మారి డబ్బులు సంపాదించి నా కోసం ఖర్చు పెట్టినదంతా ఇచ్చాను. తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో అవకాశం వచ్చింది. తర్వాత సమంత పరిచయమైంది. అలా యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాను. చాలా చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు మోయడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాను' అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement