breaking news
Preetika Rao
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
మహేశ్ బాబు 'అతిథి' సినిమాలో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న అమృతరావ్ ప్రస్తుతం కెరీర్, ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా ఉంది. ఈమె సోదరి ప్రీతిక రావ్ కూడా హీరోయినే. గతంలో తెలుగులో 'ప్రియుడు' అనే సినిమా చేసింది. ఈమెనే ఇప్పుడు పెళ్లి చేసుకుంది. బెంగళూరులో తమిళ-బ్రహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఈ శుభాకార్యం జరిగింది. వివాహ ఫొటోలు పోస్ట్ చేసిన ప్రీతిక.. భర్త ముఖాన్ని మాత్రం దాచిపెట్టేసింది.(ఇదీ చదవండి: చాహల్ మాజీ భార్య తెలుగు సినిమా.. ఎట్టకేలకు రిలీజ్)'గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీ, నా తల్లిదండ్రులు, సోదరి అమృత, బంధువులు, స్నేహితుల ఆశీస్సులతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణంలో నా పెళ్లి వైభవంగా జరిగింది. స్వయంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం నా జీవితంలో ప్రత్యేకమైన, మరపురాని ఘట్టం. సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన నాకు.. ఆ కుటుంబ సంస్కృతి, నా మంగళూరు మూలాలు, కర్ణాటక సంప్రదాయాలని పోలినట్లు అనిపించాయి. వివాహం అనేది వ్యక్తిగతమైన, పవిత్రమైన అనుభూతి. అలాంటి మధురమైన క్షణాలను అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు' అని ప్రీతిక రావు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.ప్రస్తుతానికైతే నటనకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసిన ప్రీతిక.. ప్రస్తుతం పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తోంది. 201-17 మధ్య తమిళ, కన్నడ, తెలుగు, హిందలో తలో సినిమా చేసింది. ఇవి కాకుండా మూడు సీరియల్స్, రెండు ఆల్బమ్ సాంగ్స్‌లోనూ నటించింది.(ఇదీ చదవండి: సేవ్ వైజాగ్.. తెలుగు హీరోయిన్ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by PREETIKA RAO (@preetika_pree) -
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ నటి అమృత అరోరా సోదరి, నటి ప్రీతిక రావు (Preetika Rao).. ఓ నెటిజన్‌పై భగ్గుమంది. వద్దంటున్నా వినకుండా నటుడు హర్షద్ అరోరా (Harshad Arora)తో కలిసున్న వీడియోను పదేపదే షేర్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి చెప్తే అర్థం కాదా? అంటూ విరుచుకుపడింది. హర్షద్ అరోరా, ప్రతీక రావు బెయింటెహా సీరియల్లో కలిసి నటించారు. అందులోని సీన్లను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి ప్రీతికకు నచ్చలేదు. వాటిని తీసేయమని కోరింది. దీంతో సదరు అభిమాని.. పదేళ్ల క్రితం మీరు అతడితో కలిసి నటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ప్రశ్నించాడు. బుర్ర లేదా? చెప్తే అర్థం కాదా?అందుకామె.. ఓరి నీ తెలివితక్కువవాడా.. నీకేం చెప్పినా అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు సడన్‌గా చెప్పి చేయమంటారు. అందుకే నేను టీవీలో అలాంటి సీన్లలో నటించాను. అంతమాత్రానికి ఆ సీన్ వీడియోలను పదేపదే షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. ఇండస్ట్రీలో కొత్తగా ఎవరొస్తే వారితో పడక పంచుకునే వ్యక్తి తను.. అలాంటివాడితో కలిసి నటించిన వీడియోలు పోస్ట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవే.. నా మనసుకు నచ్చని పని చేస్తున్నావు. అనుభవిస్తావ్..అందుకు కర్మ అనుభవిస్తావ్. బెయింటెహా సీరియల్లో 95 శాతం వరకు సాధారణ సీన్లే ఉంటాయి. కేవలం 5 శాతం మాత్రమే ఎక్కువ సాన్నిహిత్యంతో ఉన్న సన్నివేశాలున్నాయి. నా మాట లెక్క చేయకుండా వాటిని షేర్ చేస్తూనే ఉన్నావ్.. ఇంతకింతా అనుభవిస్తావ్ అని శపించింది. ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో హిట్ సీరియల్బెయింటెహా సీరియల్ 2013లో ప్రసారమైంది. ఇందులో ప్రీతిక- హర్షద్ జంటగా నటించారు. అప్పట్లో ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగింది. తర్వాత ప్రీతిక.. లవ్ కా హై ఇంతేజార్, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్ చేసింది. తెలుగులో 'ప్రియుడు' సినిమాలో వరుణ్ సందేశ్ సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. తమిళంలో 'చిక్కు బుక్కు', కన్నడలో 'రెబల్' సినిమాలు చేసింది. హర్షద్.. ఘమ్ హై కిసీకే ప్యార్ మే, సాసురాల్ సిమర్ కా, డల్హీజ్, దేవోంకే దేవ్.. మహదేవ్ వంటి సీరియల్స్‌లో నటించాడు.చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ -
ఇలాంటి రూమర్లు ఎలా పుట్టిస్తారో?
ముంబై: తనకు పెళ్లి చేసుకునే తీరిక లేదని బహుభాషా నటి ప్రీతికా రావు చెప్పింది. తాను సింగిల్ గానే ఉన్నానని, మింగిల్(జతకట్టడం)కు సమయం లేదని తెలిపింది. 'బెంతెహా' హిందీ సీరియల్ దర్శకుడుతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తోందని రుమార్లు వచ్చాయి. వీటిని ప్రీతికా రావు తోసిపుచ్చింది. ఇలాంటివి ఎలా పుట్టిస్తారో అంటూ రుసురుసలాడింది. 'బెంతెహా' సీరియల్ కు ఇద్దరు దర్శకులు అంకుర్ భాటియా, పుష్కర్ పండిట్ ఉన్నారని ఆమె తెలిపింది. పుష్కర్ తనను 'అలో' అనే ముద్దు పేరుతో పిలుస్తాడని వెల్లడించింది. అంకుర్ అయితే మల్లికా-ఇ-బెంతెహా పేరుతో తనను పిలుస్తారని చెప్పింది. పుష్కర్ తో తాను కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం పట్ల ప్రీతికా రావు అభ్యంతరం వ్యక్తం చేసింది. పుష్కర్, తాను మంచి స్నేహితులమని.. అంతకుమించి తమ మధ్య ఏమీలేదని స్పష్టం చేసింది.


