
ఇలాంటి రూమర్లు ఎలా పుట్టిస్తారో?
తనకు పెళ్లి చేసుకునే తీరిక లేదని బహుభాషా నటి ప్రీతికా రావు చెప్పింది.
ముంబై: తనకు పెళ్లి చేసుకునే తీరిక లేదని బహుభాషా నటి ప్రీతికా రావు చెప్పింది. తాను సింగిల్ గానే ఉన్నానని, మింగిల్(జతకట్టడం)కు సమయం లేదని తెలిపింది. 'బెంతెహా' హిందీ సీరియల్ దర్శకుడుతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తోందని రుమార్లు వచ్చాయి. వీటిని ప్రీతికా రావు తోసిపుచ్చింది. ఇలాంటివి ఎలా పుట్టిస్తారో అంటూ రుసురుసలాడింది.
'బెంతెహా' సీరియల్ కు ఇద్దరు దర్శకులు అంకుర్ భాటియా, పుష్కర్ పండిట్ ఉన్నారని ఆమె తెలిపింది. పుష్కర్ తనను 'అలో' అనే ముద్దు పేరుతో పిలుస్తాడని వెల్లడించింది. అంకుర్ అయితే మల్లికా-ఇ-బెంతెహా పేరుతో తనను పిలుస్తారని చెప్పింది. పుష్కర్ తో తాను కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం పట్ల ప్రీతికా రావు అభ్యంతరం వ్యక్తం చేసింది. పుష్కర్, తాను మంచి స్నేహితులమని.. అంతకుమించి తమ మధ్య ఏమీలేదని స్పష్టం చేసింది.