తాను సినిమాలకు గుడ్‌బై చెప్పానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాస్టర్ భరత్ స్పష్టం చేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో ఇకపై నటించకూడదని భరత్ నిర్ణయించుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై స్పందించిన భరత్.. తాను నటనకు దూరం కావడం లేదని చెబుతూ వీడియో విడుదల చేశారు.
(చదవండి: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించారు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్)
చిన్నతనంలోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన మాస్టర్ భరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలనటుడు. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘కింగ్’, ‘బిందాస్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తదితర చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. బాలనటుడిగా దాదాపు 80కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. రెండు నంది అవార్డులను కూడా అందుకున్నారు. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా, కీలక పాత్రల్లో నటించే ప్రయత్నం చేశారు.
(చదవండి: సోషల్ మీడియాను ఊపేసిన ‘చందమామ’ వీడియో సాంగ్ వచ్చేసింది)
అయితే కొంతకాలంగా భరత్ సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో ఆయన నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రచారంపై భరత్ స్పందిస్తూ వీడియో ద్వారా తన వైపు నుంచి స్పష్టత ఇచ్చారు. తాను నటనకు దూరమవుతున్నానంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపారు. సినిమాల్లోకి పూర్తిగా గుడ్‌బై చెప్పడం లేదని స్పష్టం చేశారు. ‘నటనను దూరం పెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ కావాలని అమ్మ చెప్పిందని.. అందుకే నేను ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. అమ్మ ఎప్పుడు సినిమాల్లోకి వెళ్లొద్దని చెప్పలేదు. నేను ఏ పని చేసిన ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటుంది. చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాను. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాను. ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను. త్వరలో మైత్రీమూవీ మేకర్స్ నుంచి ఓ సినిమా చేస్తున్నాను.హిందీలోనూ ఓ ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి’ అని భరత్ చెప్పాడు.
నటనకు గుడ్‌బై చెప్పాననే వార్తల్లో వాస్తవం లేదు: మాస్టర్ భరత్ #MasterBharat https://t.co/EN57cQAiAk
— Anji Shette (@AnjiShette) November 14, 2026


