‘ఎన్నికల పటాన్ని మార్చే ప్రయత్నాలను ప్రతిఘటిస్తాం’ | Minister Uttam Kumar Reddy On Delimitation Episode | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల పటాన్ని మార్చే ప్రయత్నాలను ప్రతిఘటిస్తాం’

Nov 28 2026 10:01 PM | Updated on Nov 28 2026 10:01 PM

Minister Uttam Kumar Reddy On Delimitation Episode

హైదరాబాద్: డీలిమిటేషన్ పేరుతో సామాజిక న్యాయంపై దాడి జరుగుతుందని, దాన్ని అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలిపిన మంత్రి ఉత్తమ్‌.. ‘850’ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని కబళించనివ్వమన్నారు.  ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు మంత్రి ఉత్తమ్‌. 

 లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదనపై  ఆందోళన వ్యక్తం చేసిన ఉత్తమ్‌.. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల పటాన్ని మార్చే ప్రయత్నాలను ప్రతిఘటిస్తామన్నారు. 

అణగారిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కుదిస్తే సహించేది లేదు. డీలిమిటేషన్‌ ప్రక్రియ స్వతంత్రంగా, పారదర్శకంగా జరగాలి. ఇది కేవలం సీట్ల సంఖ్యకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిని కాపాడే పోరాటమిది. ‘850’ సంఖ్యను దేశ యువత గుర్తుంచుకోవాలన్న రాహుల్‌ హెచ్చరిక కీలకం. స్థానాల పెంపు ముసుగులో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం. సీట్ల సంఖ్య పెరిగినంత మాత్రాన సామాజిక న్యాయం లభించదు. నియోజకవర్గాల సరిహద్దులను ఎవరి ప్రయోజనాల కోసం మారుస్తున్నారో చెప్పాలి. 

డీలిమిటేషన్‌ను రాజకీయ ఆయుధంగా మార్చడం ప్రజాస్వామ్యంపై దాడి. 2027 జనగణన, కులగణన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. 2011 జనాభా లెక్కలతో స్థానాలను కేటాయిస్తే తీవ్ర అన్యాయం. స్థానాల కేటాయింపును 2051 వరకు స్తంభింపజేసే ప్రయత్నం సరికాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల ప్రాతినిధ్యంపై రాజీ లేదు. ప్రతి సామాజిక వర్గం గొంతు చట్టసభల్లో వినిపించాలి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 21 ఏళ్ల త‌ర్వాత ఒకే వేదికపై హరీశ్‌రావు, జగ్గారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement