బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి | Nandyal Road Accident Two Killed Bolero Collides With RTC Bus Atmakur | Sakshi
Sakshi News home page

బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి

Oct 5 2026 11:55 PM | Updated on Oct 5 2026 11:57 PM

Nandyal Road Accident Two Killed Bolero Collides With RTC Bus Atmakur

ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భైర్లుటి సమీపంలో నల్లమల ఘాటు రోడ్లులో బొలెరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయానిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాల‍య్యాయి. పరిస్థితి విషమంగా ఉంది.

కర్నూలు నుంచి కాకినాడకు వెళుతున్న హైటెక్ ఆర్టీసీ బస్సు, దోర్నాల నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement