ప్రొద్దుటూరు(వైఎస్సార్ కడప జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిందేమీ లేదని, ఒకవేళ చేసిందేమైనా ఉంటే బహిరంగంగా చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. 40 ఏళ్లుగా చూస్తే రాయలసీమ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని రాచమల్ల విమర్శించారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు కోపం అని,. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ అభివర్ణించారు.రాయలసీమ ప్రజలకు చంద్రబాబు హరికథలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు.
‘వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు చేసేందేమీ లేదు. 40 ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తుంది. ఏవో హరికథలు మాత్రమే రాయలసీమ ప్రజలకు చెబుతారు చంద్రబాబు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి చెందింది. రాయలసీమకు మంచి చేసింది వైఎస్సార్, వైఎస్ జగన్‌లు మాత్రమే.
వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 38 లక్షల 74 వేల కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన జల్ జీవన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రశంసించింది.రూ. 700 కోట్లతో ఉద్దానానికి వైఎస్ జగన్ సురక్షిత మంచి నీరు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో తాళ్లరామాపురంలో అనేక అభివృద్ధి పనులు చేశాం’ అని స్పష్టం చేశారు.

చంద్రబాబు జీవితం మొత్తం కుట్రలే
చంద్రబాబు జీవితం మొత్తం కుట్రలేనని రాచమల్లు మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో 125 నుంచి 150 మందిని హత్యలు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లా 29 హత్యలు చేశారు. అనంతపురంలో 42 మందిని వెన్నుపోటు పార్టీ నేతలు హత్య చేశారు.శ్రీసత్యసాయి జిల్లాలో 54 మందిని హత్య చేశారు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ


