తాడిపత్రిలో హైటెన్షన్‌.. పెద్దారెడ్డి ఇంటిపై దాడి | JC Prabhakar And TDP Supporters Over Action At Tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో హైటెన్షన్‌.. పెద్దారెడ్డి ఇంటిపై దాడి

Nov 20 2026 12:01 PM | Updated on Nov 20 2026 12:05 PM

JC Prabhakar And TDP Supporters Over Action At Tadipatri

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడి ఘటనలో పెద్దారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసమయ్యాయి. ఆయనకు చెందిన 10 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 20 బైక్‌లకు నిప్పు పెట్టారు. దీంతో, భారీగా ఆస్తి నష్టం జరిగింది.

తాడిపత్రిలో జేసీ వర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్‌ చేసి దాడులు చేస్తూనే ఉంది. నిన్నటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దారెడ్డి ఫిర్యాదులో జేసీ వర్గం మరింత రెచ్చిపోయింది. తాజాగా పెద్దారెడ్డి నివాసంపై దాడులకు పాల్పడింది. కేతిరెడ్డికి చెందిన 10 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 20 బైక్‌లకు టీడీపీ గూండాలు నిప్పు పెట్టారు.

ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం. జేసీ వర్గం వరుస దాడులతో తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడులకు బాధ్యులైన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: జనసేన ఎమ్మెల్యేకి టీడీపీ ఝలక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement