సాక్షి, వైఎస్సార్ జిల్లా: పచ్చ గూండాల అరాచకాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై జరిగిన దాడిపై ఆయన స్పందిస్తూ.. కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లా. సీఐ, ఎస్‌ఐకు సమాచారం ఇచ్చా. బీటెక్ రవి ఆధ్వర్యంలోనే దాడులు చేశారు. పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ల కోసం వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు. మమ్మల్ని అడ్డుకుని దాడులు చేశారు. దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. బాధితులపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా? లేదా?’’ అంటూ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై హత్యాయత్నం


