కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ | Pulivendula: Kadapa Mp Ys Avinash Reddy Arrested | Sakshi
Sakshi News home page

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌

Nov 20 2026 12:37 PM | Updated on Nov 20 2026 12:41 PM

Pulivendula: Kadapa Mp Ys Avinash Reddy Arrested

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు. పులివెందుల పోలీస్ స్టేషన్‌కు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష,  ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ,కడప మాజీ మేయర్ సురేష్ బాబు చేరుకున్నారు. సంయమనం పాటించాలని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. పులివెందులలో శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా.. సంయమనం పాటించాలని కార్యకర్తలకు అవినాష్‌రెడ్డి సూచించారు.

అంకాలమ్మ గూడూరు ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తమ పార్టీ సానుభూతిపరులు నామినేషన్ వేయకుండా పెట్రోల్ బాంబులతో దాడి చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే తమవారిని చివరి రోజు నామినేషన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కోరింది.

ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన పులివెందుల డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement