పాక్‌ సైన్యంలో భారీ మార్పులు.. మునీర్‌కు విస్త్రృత అధికారాలు | pakistan national assembly passes military command and nuclear | Sakshi
Sakshi News home page

పాక్‌ సైన్యంలో భారీ మార్పులు.. మునీర్‌కు విస్త్రృత అధికారాలు

Aug 21 2026 7:11 AM | Updated on Aug 21 2026 7:17 AM

pakistan national assembly passes military command and nuclear

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. సైనిక వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా "డిఫెన్స్‌ ఫోర్స్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ యాక్ట్‌"  2026తో పాటు నేషనల్‌ కమాండ్ అథారిటీ యాక్ట్‌ 2010కు పలు కీలక సవరణలు చేసింది. దీంతో కొత్త విధానంలో పాకిస్థాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను ఒకే సమన్వయ వ్యవస్థ కిందకు తీసుకవచ్చింది. ఈ వ్యవస్థకు  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వం వహించనున్నారు.

కొత్త చట్టం ప్రకారం చీఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌కు  (CDF)కు మూడు దళాల ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్, సమన్వయం, మల్టీ-డొమైన్ ఇంటిగ్రేషన్, వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ వంటి విస్తృత బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా సైనిక సిబ్బంది విషయంలోనూ మునీర్‌కు గణనీయమైన అధికారాలు కల్పించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సిబ్బందిని రిటైర్ చేయడం, సర్వీసు నుంచి విడుదల చేయడం లేదా తొలగించడం, రాజీనామాను అంగీకరించడం లేదా తిరస్కరించడం, సర్వీసులో కొనసాగించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అవసరమైతే నిర్దేశిత పదవీ విరమణ వయస్సు లేదా సర్వీసు పరిమితిని కూడా సడలించే అధికారం ఉంటుంది. అయితే చట్టంలో పేర్కొన్న కొన్ని మినహాయింపులు దీనికి వర్తిస్తాయి.

ప్రధానికి ప్రధాన సైనిక సలహాదారుగా CDF

డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ నేరుగా CDF ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో అసిమ్ మునీర్ పాకిస్థాన్ ప్రధానమంత్రికి “ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్”గా వ్యవహరించనున్నారు. కమాండ్, కంట్రోల్‌కు సంబంధించిన అంశాల్లో CDF ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు. అదే సమయంలో ప్రభుత్వం CDFకు చట్టంలో పేర్కొన్న వాటికి అదనంగా ఇతర బాధ్యతలు, అధికారాలను కూడా అప్పగించే అవకాశం ఉంది. కొత్త వ్యవస్థ అమలులో ఏవైనా ఇబ్బందులు లేదా నిబంధనల మధ్య విభేదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేసే అధికారం సైతం కల్పించారు.

అదే విధంగా గత ఏడాది 27వ రాజ్యాంగ సవరణలో భాగంగా కమాండర్ ఆఫ్ ది నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ (CNSC) అనే హోదాను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ వ్యూహాత్మక దళాల ఆపరేషనల్ సమన్వయానికి ఈ అధికారి బాధ్యత వహిస్తారు. గత నెల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి నుంచి పదోన్నతి పొందిన జనరల్ సయ్యద్ ఆమిర్ రజాను తొలి CNSCగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement