వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్‌ | Three awarded Nobel Prize in Medicine | Sakshi
Sakshi News home page

వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్‌

Oct 5 2026 3:17 PM | Updated on Oct 5 2026 3:51 PM

Three awarded Nobel Prize in Medicine

వైద్య విభాగంలో విశిష్ట సేవలందించినందుకు గానూ ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ వరించింది. కార్ల్ డిసెరోథ్, పీటర్ హెగ్‌మన్, జార్జ్‌ నాగేల్‌కు ఈ ఏడాది నోబెల్‌ అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఆప్టోజెనెటిక్స్‌పై అధ్యయనాలకు విశేష కృషి చేసినందుకు గానూ ఈ ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. కాగా ఈ ఏడాది నోబెల్‌ ప్రైజ్‌ పురస్కారాల ప్రకటన ఈ రోజు (సోమవారం) నుంచి మెుదలైంది.

ఆఫ్టోజెనెటిక్స్‌పై విశేష కృషి
పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్, కార్ల్ డైసెరోత్‌ల విశేష కృషి వల్ల కాంతిని ఉపయోగించి మెదడులోని న్యూరాన్లను నియంత్రించే ఆప్టోజెనెటిక్స్‌ అనే విప్లవాత్మక పద్ధతి అభివృద్ధి చెందింది. హెగెమాన్, నాగెల్‌లు ఆల్గీలో కాంతికి స్పందించే చానల్‌ రోడాప్సిన్‌ అనే ప్రోటీన్‌ను గుర్తించి, కాంతి పడినప్పుడు అది కణాల్లో విద్యుత్ మార్పును కలిగిస్తుందని నిరూపించారు.

డైసెరోత్ ఈ కాంతి-స్పందించే ప్రోటీన్‌ను న్యూరాన్లలో ఉపయోగించి, ప్రత్యేక కాంతిని ప్రసరించడం ద్వారా నిర్దిష్ట న్యూరాన్లను కచ్చితంగా ON లేదా OFF చేయగలమని చూపించారు. దీనివల్ల మెదడులోని ఏ న్యూరాన్లు కదలిక, జ్ఞాపకం, భావోద్వేగాలు, ప్రవర్తన వంటి పనుల్లో ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యక్షంగా అధ్యయనం చేసే శక్తివంతమైన సాధనం శాస్త్రవేత్తలకు లభించింది.

వైద్యశాస్త్రంలో నోబెల్‌
1901 నుంచి 116 మెడిసిన్ ప్రైజ్‌ల‌ను ప్ర‌క‌టించారు. 232 మంది వ్య‌క్తులు మెడిసిన్‌లో ప్రైజ్ అందుకున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్న అతిపిన్న వ‌య‌స్కుడు ఫ్రెడ్రిక్ బ్యాటింగ్. 32 ఏళ్ల వ‌య‌సులో అత‌ను ఆ అవార్డు గెలిచాడు. అవార్డు అందుకున్న వృద్ధుడిగా పేట‌న్ రౌస్ ఉన్నారు. ఆయ‌న 87 ఏళ్ల వ‌య‌సులో మెడిసిన్ నోబెల్ అందుకున్నారు. 

 

ఇదీ చదవండి: భారత్‌లో ఎన్నికలట.. ట్రంప్‌ పోస్ట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement