రక్షకుడు సినిమా ఇంట్రోలో నాగార్జున కుక్కతో జాగింగ్‌కు వెళ్లాడు. ఒకడు క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని.. ఇండియా ఓడుతుందని బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. ఆ మాటతో నరాలు తెగెంత కోపం తెచ్చుకుని వాడి చెంపలు వాయిస్తాడు నాగ్. కలలో కూడా ఇండియా ఓడిపోకూడదని కోరుకోకూడదని అక్కడున్నవాళ్లకు క్లాస్ పీకుతాడు. సందర్భం వేరైనా ఇక్కడో భారతీయుడు కూడా ఇలాంటి మమ‘కారమే’ ప్రదర్శించాడు.
ఓ షాపింగ్ మాల్. లైవ్‌స్ట్రీమ్‌లో కెమెరా ఆపమని చెప్పినా వినలేదు. పదే పదే రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణకు దిగాడు. అయినా సున్నితంగా వాళ్లు వద్దని చెబుతూ వచ్చారు. ఈసారి హద్దులు దాటి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. దేశాన్ని తిట్టాడు. సహనం నశించిన ఓ భారతీయుడు.. ఫట్‌మని అతడి చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కెనడాకు చెందిన స్ట్రీమర్ జాన్ లై(John Ly).. ఆన్‌లైన్‌లో జాన్‌వాట్స్‌గోయింగ్‌ఆన్ (JohnWhatsGoingOn) పేరుతో కంటెంట్ చేస్తుంటాడు. వియత్నాంలోని సైగాన్‌లో ఓ స్టోర్ వద్ద అతడు లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుండగా ఇద్దరు భారతీయులు అతడి కెమెరా ముందుకు వచ్చారు. అయితే తమను అనుమతి లేకుండా చిత్రీకరించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కెమెరాను తమవైపు తిప్పొద్దని పలుమార్లు కోరారు. అయితే జాన్ మాత్రం లైవ్‌స్ట్రీమ్‌ను ఆపకుండా వారితో మాట్లాడటం కొనసాగించాడు. ఈ క్రమంలో.. వారిని వ్యక్తిగతంగా దూషించాడు. అంతటితో ఆగకుండా రేసిస్ట్ వ్యాఖ్యలు చేశాడు. భారత దేశాన్ని ఇష్టానుసారం తిడుతూ కామెంట్లు చేశాడు.
ఆ మాటలతో ఇద్దరు భారతీయుల్లో ఒకరికి ఒళ్లు మండిపోయింది. జాన్ దగ్గరకు వెళ్లి అతడి చెంపపై కొట్టాడు. ఆ సమయంలోనూ లైవ్‌స్ట్రీమ్ కొనసాగుతూనే ఉండటంతో మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది. జాన్ కూడా ఆ సమయంలో హిందీలో వారిని దూషిస్తూ మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈలోపు కొందరు భారతీయులు అక్కడ గుమిగూడి జాన్‌ను అలాంటి మాటలొద్దని హెచ్చరించారు.
🚨 WATCH: 🇮🇳 Indian men confront and slap a racist 🇨🇦 Canadian streamer in 🇻🇳 Vietnam after he passed racist remarks and filmed them up close on a live Kick stream while his chat posted “F*** INDIA” and “dirty Indian.” https://t.co/od9ABGN9OB
— Beats in Brief 🗞️ (@beatsinbrief) October 4, 2026
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, రెడిట్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తమను రికార్డు చేయొద్దని పలుమార్లు చెప్పిన తర్వాత కూడా జాన్ చిత్రీకరణ కొనసాగించడంపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు.
సాధారణంగా.. ఐఆర్‌ఎల్ (IRL) స్ట్రీమింగ్‌లో క్రియేటర్లు తాము ఉన్న ప్రదేశంలో జరిగే విషయాలను నేరుగా ప్రసారం చేస్తుంటారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా కెమెరాలో కనిపించడం సాధారణమే. అయితే ఎవరైనా తమను రికార్డు చేయొద్దని స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు.. ఆపేయాలి. కానీ, జాన్ ఉద్దేశపూర్వకంగా వాళ్లను దూషిస్తూ గొడవ పడ్డాడు. సో.. అతనిదే తప్పని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు.
ఒక్కటి సరిపోదేమో భయ్యా!
జాన్ కంటెంట్ దాదాపుగా ఇతర దేశాలను అవమానించేలా ఉంటుంది. ఆ దేశాలకు వెళ్తూ.. అక్కడి మనుషుల్ని, ఆహారపు అలవాట్లను హేళన చేస్తుంటాడు అతను. అతని వీడియోలో చాలా మట్టుకు ఇవే. అలాంటి కంటెంట్‌తోనే ఫాలోవర్స్, సబ్‌స్క్రయిబర్స్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. అంతేకాదు.. కాళిమాత విషయంలోనూ ఓ వీడియో నెట్టింట విమర్శలకు తావిచ్చింది. దీంతో.. అతని ప్రొఫైల్ చూసిన వాళ్లంతా ఒకటి కాదు.. మరో నాలుగు తగిలిస్తే సరిపోయేదేమో అనే కామెంట్లు చేస్తున్నారు.
KICK STREAMER JOHNWHATSGOINGON CONTINUES TO MOCK INDIANS Seems that slap wasn't enough. JohnWhatsGoingOn posted a video of him wearing a black turban, smiling while displaying and insulting Hindu deity imagery and engaging with chat comments referencing Indian accents He also says he is “ready to go to war” and “can’t wait to get assaulted again,” appearing to remain defiant amid the backlash.
— Subodh Kumar (@kumarsubodh_) October 5, 2026


