ఫొటో అడిగిన భారత జవాన్‌ భార్య.. పాక్‌ రేంజర్‌ రియాక్షన్‌ ఇదే.. | Pakistani Rangers Soldier saluted Indian officer Viral Video | Sakshi
Sakshi News home page

ఫొటో అడిగిన భారత జవాన్‌ భార్య.. పాక్‌ రేంజర్‌ రియాక్షన్‌ ఇదే..

Oct 4 2026 11:23 AM | Updated on Oct 4 2026 11:30 AM

Pakistani Rangers Soldier saluted Indian officer Viral Video

సరిహద్దు అంటేనే ఉద్రిక్తతలు.. రెండు దేశాల సైనికులు అంటేనే అప్రమత్తత.. కానీ అదే సరిహద్దులో కెమెరాకు చిక్కిన ఓ క్షణం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఓ భారత ఆర్మీ అధికారి భార్య.. అక్కడ విధుల్లో ఉన్న పాకిస్థాన్‌ రేంజర్‌తో ఫొటో దిగాలని కోరారు. ఆమె అభ్యర్థనకు పాక్‌ రేంజర్‌ మర్యాదగా స్పందించాడు. ఎలాంటి సంకోచం లేకుండా ఫొటోకు నిలబడ్డాడు.

అయితే అసలు ట్విస్ట్‌ ఆ తర్వాతే ఉంది. వారి ఫొటో పూర్తయ్యాక.. పాక్‌ రేంజర్‌ భారత ఆర్మీ అధికారి వైపు తిరిగాడు. ఒక్క క్షణం ఆగి.. గౌరవ సూచకంగా సెల్యూట్‌ చేశాడు. ఆ ఒక్క సెల్యూట్‌.. అక్కడున్న వాతావరణాన్నే మార్చేసినట్టుగా అనిపించింది. దేశాలు వేరు.. సరిహద్దులు వేరు.. యూనిఫామ్‌లు వేరు.. కానీ సైనికుడి యూనిఫామ్‌కు ఇచ్చే గౌరవం మాత్రం సరిహద్దులు దాటుతుంది.

దేశం కోసం నిలబడిన భారత సైనికుడికి.. ప్రత్యర్థి దేశానికి చెందిన రేంజర్‌ సెల్యూట్‌ చేసిన ఆ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గన్‌ పట్టిన చేతే.. గౌరవం కోసం సెల్యూట్‌ చేసింది!. భారత సైనికుడి యూనిఫామ్‌ ముందు.. ఆ ఒక్క సెల్యూట్‌ చెప్పిన కథ ఇదే!. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 ఇదీ చదవండి: బీజేపీకి బిగ్‌ షాక్‌.. ఇది ఊహించలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement