పిల్లల ఆరోగ్యంపై అతిజాగ్రత్త.. వారి ఎదుగుదలకు అడ్డంకేనా? | Overprotective Parenting Child Development | Sakshi
Sakshi News home page

పిల్లల ఆరోగ్యంపై అతిజాగ్రత్త.. వారి ఎదుగుదలకు అడ్డంకేనా?

Oct 24 2026 11:34 AM | Updated on Oct 24 2026 11:34 AM

Overprotective Parenting Child Development

పేరెంటింగ్‌

పిల్లలకు మట్టి అంటకూడదు.. దుమ్ము తగలకూడదు.. పరిగెత్తితే కింద పడకూడదు. ఏ వస్తువును ముట్టుకున్నా వెంటనే చేతులు కడగాలి.. ఇతర పిల్లలతో ఆడితే, బయటకు వెళ్లనిస్తే ఎక్కడ జబ్బులు వస్తాయేమోనన్న భయం. ఇలా ప్రతిదానికీ ఆందోళన చెందుతున్నారు నేటి పేరెంట్స్‌. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమే. కానీ ప్రతి చిన్న ప్రమాదం నుంచి కాపాడాలనే అతిజాగ్రత్త వారి సహజ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

  • మట్టిలో ఆడుకోవడం, గడ్డిపై నడవడం, ప్రకృతిని దగ్గరగా చూడటం, ఇతర పిల్లలతో కలవడం వంటివి చిన్నారులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. మట్టిలో ఆడటం వంటి వారిలో ఇమ్యూనిటీకి తోడ్పడుతుంది. ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం వల్ల కొత్త విషయాలను నేర్చుకుంటారు.

  • ప్రతి పనికీ పిల్లలు.. తల్లిదండ్రులపైనే ఆధారపడేట్లు చేయకూడదు. దీనివల్ల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం వంటివి నేర్చుకోవడానికి సమయం పడుతుంది. ఆటలో చిన్నగా పడిపోవడం, కొత్త పనిని ప్రయత్నించడం, ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం వంటి అనుభవాలు ధైర్యాన్ని పెంచుతాయి. ప్రతిదానికీ భయపడే వాతావరణం పిల్లల్లో ఆందోళనను పెంచవచ్చు.

పిల్లలను ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేయకుండా.. బయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. పిల్లల్ని కాపాడటం అంటే ప్రపంచం నుంచి దూరంగా ఉంచడం కాదు.. ప్రపంచాన్ని సురక్షితంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడం!

ఇదీ చదవండి: పిల్లల్లో నైతిక విలువలు పెంచాలంటే.. పేరెంట్స్‌ ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement