వంట నేర్చుకునే బుజ్జాయిలకై.. ఈ క్యూట్‌ గాడ్జెట్స్‌ ఓ లుక్కేయండి! | Kids Kitchen Gadgets Cooking Technology Tools | Sakshi
Sakshi News home page

వంట నేర్చుకునే బుజ్జాయిలకై.. ఈ క్యూట్‌ గాడ్జెట్స్‌ ఓ లుక్కేయండి!

Oct 25 2026 12:35 PM | Updated on Oct 25 2026 12:56 PM

Kids Kitchen Gadgets Cooking Technology Tools

ఫండే

TECH-టమారం

అమ్మ వంట చేస్తుంటే, పక్కన నిలబడి ‘నేనూ హెల్ప్‌ చేస్తా!’ అనడం పిల్లలకు భలే సరదా! మరి ఇంట్లోనే చిన్న షెఫ్‌లుగా మారాలనుకునే బుజ్జాయిల కోసమే ఈ సూపర్‌ క్యూట్‌ కిచెన్‌  గాడ్జెట్స్‌.

క్యూట్‌ కట్స్‌! 
వంట మొదలుపెట్టాలంటే కూరగాయలను కట్‌ చేయాల్సిందే! కానీ పెద్దవాళ్లు వాడే పదునైన కత్తులను పిల్లల చేతికి ఇవ్వలేం కదా! అందుకే, చిట్టి షెఫ్‌ల కోసం వచ్చేసింది ఈ క్యూట్‌ వెజిటబుల్‌ కట్టర్‌ సెట్‌! ఇందులో మూడు రకాల కత్తులతో పాటు, క్రింకిల్‌ కట్టర్‌ కూడా ఉంటుంది.

మొనదేలని చివరలు, పళ్లలాంటి అంచులతో రూపొందించిన ఈ కత్తులతో మెత్తని పండ్లు, కూరగాయలు, బ్రెడ్‌ వంటివి కట్‌ చేయొచ్చు. రంగురంగుల హ్యాండిల్స్‌ పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. వంట పనుల్లో పిల్లలూ భాగస్వాములు కావడంతో తమ పనులు తామే చేసుకోవాలనే ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే, పిల్లల కోసం రూపొందించినవే అయినా పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. నాలుగు పీసుల ఈ సెట్‌ ధర సుమారు రూ.263.

వంటగదికి... సిక్స్‌ప్యాక్‌!
చిట్టి చిట్టి చేతులకు బరువైన పెద్ద పెద్ద పనిముట్లు ఇస్తే పని కంటే ప్రమాదాలే ఎక్కువ! అందుకే, క్యూట్‌గా ఉండే ఈ సిక్స్‌ ఇన్‌  వన్‌ కిచెన్‌  గాడ్జెట్‌ సెట్‌ చిన్నారులకు బాగా నచ్చుతుంది. ఇందులో ఆరు రకాల వంటింటి పనిముట్లు ఉంటాయి. తురమడం నుంచి పొట్టు తీయడం వరకు, అల్లంవెల్లుల్లి గ్రైండ్‌ చేయడం నుంచి పిజ్జా కట్‌ చేయడం వరకు... ఒక్కో పనికి ఒక్కో టూల్‌ ఇందులో రెడీగా ఉంటుంది.

బాటిల్‌ ఓపెనర్, ఆకుకూరల నుంచి ఆకులు వేరు చేసే టూల్‌ కూడా ఉండటంతో వంటింటి పనులకు మంచి కాంబో ఇది. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ బ్లేడ్‌లు, సౌకర్యంగా పట్టుకునే హ్యాండిల్స్‌తో రూపొందించారు. మరో ప్రత్యేకత ఏంటంటే, ఆరు టూల్స్‌నూ ఒకదానిపై మరొకటి పేర్చుకోవచ్చు. దీంతో స్థలం కూడా ఆదా అవుతుంది. అయితే, వీటి పదునైన బ్లేడ్స్‌ కారణంగా పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ధర రూ.499 మాత్రమే!

అందమైన అల్పాహారం!
కూరగాయలు, పండ్లు తినమంటే పిల్లలు మారాం చేస్తున్నారా? అయితే, వాటిని అందమైన ఆకారాల్లో మార్చి చూడండి! తినడానికి తామే మారాం చేసే ఆహారాన్ని, కొత్త రూపంలో చూస్తే చిన్నారులే ఇష్టంగా తినేస్తారేమో! అందుకు ఉపయోగపడుతుంది ఈ వెజిటబుల్‌ కట్టర్‌ సెట్‌! ఇందులో నక్షత్రం, పువ్వు, గుండె వంటి రకరకాల ఆకారాల్లో కట్టర్లు ఉంటాయి.

స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో తయారైన వీటికి చేతులకు గాయాలు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లు కూడా ఉన్నాయి. వీటితో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, బిస్కట్లను అందమైన ఆకారాల్లో కట్‌ చేయొచ్చు. పిల్లల లంచ్‌ బాక్సులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, వంట తయారీలో వాళ్లనూ భాగస్వాములను చేయొచ్చు. పన్నెండు పీసుల సెట్‌ ధర సుమారు రూ.459.

ఇదీ చదవండి: మెన్స్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌లో ఈ చిన్న తప్పు చేయకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement