ఫండే
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
బాల్యం గడిచిన ఇల్లు
ప్రపంచ ప్రసిద్ధ వ్యోమగామి, చంద్రుడిపై కాలుమోపిన తొలి మానవుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బాల్యం గడిచిన ఇల్లు ఇది. అమెరికాలోని ఒహాయా రాష్ట్రానికి చెందిన వాపకనీటా నగరంలోని బెంటన్ స్ట్రీట్‌లో ఉన్న 601 డబ్ల్యూ ఇంట్లోనే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పుట్టి పెరిగాడు.
బాల్యంలోని అతడి ఆటపాటలు ఈ రెండంతస్తుల ఇంట్లోనే గడిచాయి. ఇటీవల ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. దీని చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, దీనిని చెక్కుచెదరకుండా కాపాడాలనే ఉద్దేశంతో ‘ఆగ్లేజ్ కౌంటీ హిస్టారికల్ సొసైటీ’ విరాళాలు సేకరించి, నాలుగు లక్షల డాలర్లకు ఈ ఇంటిని కొనుగోలు చేసింది.
దీనిని ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచాలని సొసైటీ భావిస్తోంది. ఇందులో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బాల్యంలో ఉపయోగించిన ఆటబొమ్మలు, ఇతర వస్తువులు వంటివి పెట్టి, దీనిని ప్రజల సందర్శనకు అనువుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, 2030 నాటికి దీనిని ప్రజలకు అందుబాటులోకి తేగలమని సొసైటీ సభ్యుడు, రిటైర్డ్ ఆర్మీ పైలట్ గెరాల్డ్ సీసెల్ మీడియాకు చెప్పారు.
ఇదీ చదవండి: నా విజయాన్ని నాన్న చూస్తున్నారు!


