అతి పొడవాటి తోక | American horse enters Guinness Book of Records with longest horse tail | Sakshi
Sakshi News home page

అతి పొడవాటి తోక

Nov 1 2026 1:49 AM | Updated on Nov 1 2026 1:49 AM

American horse enters Guinness Book of Records with longest horse tail

ప్రపంచంలో నానా జాతుల గుర్రాలు ఉన్నాయి. ఏ జాతి గుర్రానికైనా తోక పొడవు దాదాపు అరడుగు నుంచి ఐదు అడుగుల వరకు ఉంటుంది. గుర్రాలకు ఐదు అడుగులకు మించి పొడవున్న తోకలు అరుదు. అమెరికాలోని ఒహాయోకు చెందిన ఈ గుర్రానికి ఏకంగా పదమూడున్నర అడుగుల పొడవైన తోక ఉంది.

 అతి పొడవాటి తోక గల గుర్రంగా దీని ఘనతను గిన్నిస్‌ బుక్‌ ఇటీవలే గుర్తించి, రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కూడా బహూకరించింది. ఒహాయాకు చెందిన మెకంజీ లోవె, రాషెల్‌ ఎస్టెస్‌ పెంచుకుంటున్న ఈ గుర్రం పేరు జెన్నీ. ఇది ‘అమెరికన్‌ సాడిల్‌బ్రెడ్‌’ జాతికి చెందిన జవనాశ్వం. ఇదివరకు 2007లో పన్నెండున్నర అడుగుల తోకతో ఒక గుర్రం గిన్నిస్‌ రికార్డును సాధించింది. తాజాగా జెన్నీ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement