చిన్న, పెద్ద, పేద, ధనిక, కులమత తారతమ్యాలు అనేవి లేకుండా దేవుడి వద్ద అంతా ఒకటే.. అంతా సమానమే అంటారు. అలాంటి సమానత్వం కనిపించేది మనకు అయ్యప్పస్వామి దీక్షలో.. మండలకాల దీక్ష అంటారు. మండలానికి కొందరు ఎన్నో రకాలుగా అర్థాలు చెబుతారు. ఏది సరైంది? ఎన్ని రోజులు దీక్ష సరైంది? అయ్యప్ప దీక్షలు అంటే ఏంటి? ప్రత్యేకతలు ఏంటి? వంటి అనేక విషయాలను శబరిమల అయ్యప్ప మందిర గురు స్వామి శ్రీ మురళీ నంబుద్రి సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.
ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. గుడిలో ఏం జరుగుతుంది? ఎలాంటి పూజలు జరుగుతాయి? ఆ తర్వాత గుడి మూసే ముందు అయ్యప్పకు ఎలాంటి సేవలు చేస్తారు? వంటివి చాలా చక్కగా వివరించారు. అదే విధంగా కన్యస్వాములు ఎలా ఉండాలి? దీక్షలో ఎలా ఎలాంటి భోజనం తీసుకోవాలి? అయ్యప్ప దీక్షలో ఏ తప్పులు చేయొద్దు? వంటివి వివరించారు. కింది వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి..


