శంఖాల గిన్నిస్‌ రికార్డు నాదం | Guinness World Record by blowing conch shells | Sakshi
Sakshi News home page

శంఖాల గిన్నిస్‌ రికార్డు నాదం

Oct 26 2026 2:17 AM | Updated on Oct 26 2026 2:17 AM

Guinness World Record by blowing conch shells

నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున ఆదివారం ఏకకాలంలో 517 మంది చేసిన శంఖనాదం గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఈ నెల 31వ తేదీ నుంచి మొదలయ్యే సింహస్థ కుంభ మేళాను పురస్కరించుకుని నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ కుంభ మేళా అథారిటీ, అనంత్‌విజయ్‌ శంఖనాద్‌ టీమ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. 

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల ప్రతినిధి రిశి నాథ్‌ సమక్షంలో 517 మంది ఐదున్నర నిమిషాలపాటు చేసిన శంఖనాదంతో గోదావరి పరిసరాలు ప్రతిధ్వనించాయి. ‘అభినందనలు, మీరు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు’అని రిశి నాథ్‌ ప్రకటించగానే, ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు భారత్‌ మాతా కీ జై అంటూ నినదించారు. కాగా, గతంలో అమెరికాలోని న్యూజెర్సీలో 2019లో 303 మందితో చేసిన శంఖనాదం ఇప్పటి వరకు ప్రపంచరికార్డుగా ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement