తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం | One Died In Road Accident At Tarnaka | Sakshi
Sakshi News home page

తార్నాకలో ప్రమాదం..ఒకరి మృతి

Feb 19 2019 3:51 PM | Updated on Feb 19 2019 7:22 PM

One Died In Road Accident At Tarnaka - Sakshi

మృతదేహం వద్ద ప్రభుత్వ సిబ్బంది

హైదరాబాద్‌: తార్నాకలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దారి తప్పి ఇద్దరి పైకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  సంఘటనాస్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement