సినిమా రేంజ్‌లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్‌! వైరల్‌ వీడియో

Viral Video: US Mail Truck Flew Off 50 Foot Bridge And Into A River  - Sakshi

A truck carrying United States Postal Service (USPS) mail: చాలా భయంకరమైన ప్రమాదాలు గురించి విన్నాం. పైగా అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ త్రుటిలో బయట పడ్డ మృత్యుంజయులను చూశాం. బతికే అవకాశం లేదనే ప్రమాదంలో గాయాలు పాలుకాకుండా బయటపడి అందర్నీ ఆశ్చర్య పరిచని ఘటనలు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్‌పీఎస్‌) మెయిల్‌ను తీసుకువెళ్తున్న ట్రక్కు 50 అడుగుల వంతెన పై నుంచి బోస‍్టన్‌ సమీపంలోని మంచుతో నిండిన నదిలో పడింది. అయితే డ్రైవర్‌ మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ డ్రైవర్‌కి ఈత రాకపోవడంతో పాక్షికంగా నీట మునిగిన ట్రక్ పై ఉన్నాడు. అంతేకాదు అతనికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.

అయితే దగ్గరలోనే అగ్నిమాపక సిబ్బంది ఉన్నందును సత్వరమే స్పందించి ఆ డ్రైవర్‌ని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అతన్ని బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు ఈ ఘటన ఆ నదికి సమీపంలో ఉన్న సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్‌ వీడియా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top