 
													
ఉక్రెయిన్ పౌరుల్లో వెల్లువెత్తుతున్న దేశభక్తి. ఏం చేసైనా తమ దేశాన్ని కాపాడుకునే క్రమంలో ధైర్య సాహసాలతో చేస్తున్న ఫీట్‌లు అందర్నీ విస్మయపరుస్తున్నాయి.
Ukrainian Man Single-Handedly Stops: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై మూడువైపుల నుంచి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లోని బఖ్‌మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేశాడు. తాను ఎంతవరకు బలంగా నెట్టగలడో అంతమేర నెట్టి ఆ తదుపరి నేలమీద మోకాళ్ల పై నిలబడి కూర్చున్నాడు. వెంటేనే అక్కడ ఉండే నివాసితులు అతని వద్దకు పరిగెత్తుకుని వస్తారు.
ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ అధికారులు ఇన్‌స్టాగ్రాంలో .."ఉక్రెయిన్ ప్రజలను బందిఖానాలో ఉంచుతానని రష్యా సంవత్సరాలుగా అబద్ధం చెబుతోంది. వాస్తవమేమిటంటే ఉక్రేనియన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించడమే కాదు అవసరమైతే తమ ఒట్టి చేతులతో రష్యన్ ట్యాంకులను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ భావోద్వేగంగా పోస్ట్‌లు పెట్టారు.
(చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
