breaking news
plunging
-
సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో
A truck carrying United States Postal Service (USPS) mail: చాలా భయంకరమైన ప్రమాదాలు గురించి విన్నాం. పైగా అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ త్రుటిలో బయట పడ్డ మృత్యుంజయులను చూశాం. బతికే అవకాశం లేదనే ప్రమాదంలో గాయాలు పాలుకాకుండా బయటపడి అందర్నీ ఆశ్చర్య పరిచని ఘటనలు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్పీఎస్) మెయిల్‌ను తీసుకువెళ్తున్న ట్రక్కు 50 అడుగుల వంతెన పై నుంచి బోస్టన్ సమీపంలోని మంచుతో నిండిన నదిలో పడింది. అయితే డ్రైవర్ మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ డ్రైవర్‌కి ఈత రాకపోవడంతో పాక్షికంగా నీట మునిగిన ట్రక్ పై ఉన్నాడు. అంతేకాదు అతనికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే దగ్గరలోనే అగ్నిమాపక సిబ్బంది ఉన్నందును సత్వరమే స్పందించి ఆ డ్రైవర్ని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అతన్ని బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు ఈ ఘటన ఆ నదికి సమీపంలో ఉన్న సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. EXCLUSIVE FOOTAGE: Never before seen video of the major TT crash Saturday in Weston Click here for more:https://t.co/CRRpYWhfAS (@MassStatePolice, @WESTON_FIRE, @NewtonFireDept, @SPAMPresident, @wbz, @WCVB, @7News, @NBC10Boston, @boston25, @bostonherald, @LiveBoston617) pic.twitter.com/ZUmJJbXF6Z — State Police Association of Massachusetts (@MSPTroopers) February 27, 2022 (చదవండి: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్ వీడియా) -
వేగంగా ఢీ కొట్టి కాక్ పిట్లో పడింది
వేగంగా వెళుతున్న మినీ హెలీకాప్టర్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే 1500 అడుగుల ఎత్తులో ఉన్న హెలీకాప్టర్ ఒక్కసారిగా 700 అడుగుల ఎత్తులోకి పడిపోయింది. పైలెట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వివరాలు.. హోవర్డ్ స్టాట్ దగ్గర ఫిల్ రాబిన్సన్ పైలట్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌లోని బోల్టన్ నగరం పై విహరిస్తున్న సమయంలో ఓ పక్షి హెలీకాప్టర్‌ను ఢీ కొట్టి కాక్‌పిట్‌లో పడింది. వేగంగా వచ్చిన పక్షి హెలీకాప్టర్ ముందు భాగంలోని గ్లాస్‌ను ఢీ కొట్టింది. బలంగా ఢీ కొట్టడంతో గ్లాస్ పగిలి కాక్ పిట్లో ఉన్న ట్రైనీ పైలెట్ రాబిన్సన్ చేతిలో పక్షిపడింది. క్షణాల్లో హెలీకాప్టర్ అదుపుతప్పి 800 అడుగుల కిందకు చేరింది. అప్రమత్తమైన సీనియర్ పైలెట్ స్కాట్ వెంటనే హెలీకాప్టర్‌ను అదుపులోకి తీసుకువచ్చాడు. క్షేమంగా బర్న్ లీ సిటీ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. క్షణాల్లో భారీ ప్రమాదం నుంచి హెలీకాప్టర్‌లో ఉన్న ఇద్దరు క్షేమంగా బయట పడినా, పక్షి మాత్రం మృతిచెందింది. భారీ ప్రమాదానికి కారణమయిన పక్షిని తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టి పార్టీ చేసుకుందామనుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాబిన్సన్ తన కెమెరాతో హెలీకాప్టర్ లోపలి భాగాన్ని వీడీయో తీశాడు. దీన్ని చూస్తే ఎంతగా ఆ హెలీకాప్టర్ డ్యామేజ్ అయ్యిందే మనకే అర్థం అవుతుంది.