కొత్త లుక్‌తో హోండా సిటీ స్పోర్ట్‌ కారు | Honda City Sport Launched At Rs 14.89 Lakh, Check Out Its Specifications Inside | Sakshi
Sakshi News home page

కొత్త లుక్‌తో హోండా సిటీ స్పోర్ట్‌ కారు

Jun 22 2025 11:28 AM | Updated on Jun 22 2025 2:34 PM

Honda City Sport launched at Rs 14 89 lakh

హోండా కార్స్‌ ఇండియా సంస్థ న్యూ సిటీ స్పోర్ట్‌ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 14,88,900గా (ఢిల్లీ ఎక్స్‌ షోరూం) ఉంటుంది. లైఫ్‌ ఈజ్‌ ఏ స్పోర్ట్‌ ట్యాగ్‌లైన్‌తో ప్రవేశపెట్టిన ఈ కార్లు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ కునాల్‌ బెహల్‌ తెలిపారు. వెలుపల స్పోర్టీ బ్లాక్‌ గ్రిల్, అలాయ్‌ వీల్స్, అలాగే లోపల ప్రీమియం లెదర్‌ బ్లాక్‌ సీట్లు, రూఫ్‌ లైనింగ్‌తో ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.

మార్కెట్లోకి మహీంద్రా ఫ్యూరియో 8 ట్రక్‌
మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ బిజినెస్‌ తాజాగా అత్యధిక మైలేజీ గ్యారంటీతో ఫ్యూరి యో 8 పేరిట తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్కులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీనివ్వకుంటే ట్రక్కును వాపసు చేయొచ్చనే ఆఫరుతో దీన్ని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ వాహనం 4, 6 టైర్ల కార్గో వేరియంట్స్‌లో లభిస్తుంది.

కొనుగోలుదారుకు అధిక ఆదాయాలు, కనిష్ట స్థాయిలో నిర్వహణ వ్యయాలతో అన్ని రకాల ప్రయోజనకరంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రెసిడెంట్‌ వినోద్‌ సహాయ్‌ పేర్కొన్నారు. అలాగే, సరీ్వసింగ్‌ విషయానికొస్తే 36 గంటల టర్నెరౌండ్‌ సమయం లేదా జాప్యం జరిగిన ప్రతి అదనపు రోజుకు రూ. 3,000 చొప్పున చెల్లించేలా సర్వీస్‌ హామీ ఉంటుందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement