ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో తన 'క్యూ3'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.51.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది నోవా, జెనిత్ అనే రెండు వేరియంట్లలో, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. కంపెనీ దీనికోసం సెప్టెంబర్ 1 నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. మొదటి విడత కొనుగోలుదారులకు డెలివరీలు అక్టోబర్ 17 నుంచే జరుగుతాయి.
సరికొత్త క్యూ3 కొత్త ఎల్ఈడీ లైట్ ప్యాకేజీతో కూడిన కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. లోపల డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, కొత్త స్టీరింగ్ వీల్ ఉన్నాయి. లెవెల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, ఈ సెగ్మెంట్లో మొదటిసారిగా త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఈ కారులో ఉన్నాయి.
క్యూ3 ఒకే టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 2.0 లీటర్ యూనిట్, 201 bhp పవర్, 320 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ రెండు ట్రిమ్‌లలోనూ స్టాండర్డ్‌గా 7-స్పీడ్ DCT, ఆడి క్వాట్రో AWD సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది బీఎండబ్ల్యూ ఎక్స్1కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన 5 డబ్బు సమస్యలు


