ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి | Road Accident in Rajasthan | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

Jul 8 2018 1:32 PM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accident in Rajasthan - Sakshi

ప్రమాద తీవ్రతకు తుక్కు తుక్కైన బస్సు

అజ్మీర్‌: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఆదివారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు తుక్కై నామరూపాలు లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదా చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement