
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ట్రాక్టర్ రాజస్థాన్‌లోని గోగామేడికి కాస్గంజ్ నుంచి బయలుదేరింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు.
అలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిందని బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తెలిపారు. కాస్గంజ్ జిల్లాలోని 60 నుంచి 61 మంది భక్తులు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది.
ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్‌ను ఘటన స్థలంనుంచి తొలగించారు. ఈ ఘటన భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిలింది.
#WATCH उत्तर प्रदेश | बुलंदशहर थाना अंतर्गत राष्ट्रीय राजमार्ग 34 पर घटाल गांव के पास, कासगंज से राजस्थान के गोगामेड़ी जा रहे गोगाजी के भक्तों से भरे ट्रैक्टर को एक कंटेनर ने टक्कर मार दी, जिससे 8 लोगों की मौत हो गई और 43 घायल हो गए हैं। pic.twitter.com/CDsRntamck
— ANI_HindiNews (@AHindinews) August 25, 2025