
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో ఉన్న దైమ్లర్ ఇండియా కమర్షియల్‌వెహికిల్స్ తాజాగా పాత వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదార్లు తమ పాత ట్రక్స్‌ను ఎక్సే్ంజ్ కింద భారత్ బెంజ్ శ్రేణి కొత్త, పాత వెహికిల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. శ్రీరామ్ ఆటోమాల్ వేదికగా భారత్ బెంజ్, ఇతర ఓఈఎంల వాహనాలను విక్రయిస్తారు.