వైరల్‌: వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు

Viral Video: Angry Elephant Chases Truck In Karnataka - Sakshi

బెంగళూరు: ‘ఒకరు నాకు ఎదురొచ్చినా.. నేను ఒకరికెదురెళ్లినా వాళ్లకే రిస్కు’ బాలయ్య చెప్పిన ఈ డైలాగ్‌ ఇక్కడ చెప్పుకునే ఏనుగుకు సరిగ్గా సరిపోతుందేమో. ఓ వ్యక్తి గురువారం ట్రక్‌ నడుపుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వీరావేశంతో ట్రక్‌వైపుకు పరుగెత్తుకుంటూ వచ్చింది. బాబోయ్‌.. ఇదేంటి, ఇలా తమవైపుకు దూసుకొస్తోందని భయపడిన ట్రక్‌ డ్రైవర్‌ ఉన్నపళంగా వాహనాన్ని వెనక్కు పోనిచ్చాడు. అయినప్పటికీ ఏనుగు ఆ ట్రక్‌ను వదల్లేదు. వెంబడించి మరీ ఆ వాహనాన్ని అందుకుంది. అంతే.. ఇక కసితీరా తొండంతో ట్రక్‌ ముందు భాగాన్ని ధ్వంసం చేసి తన కోపాన్ని తీర్చుకుంది.

అనంతరం వచ్చిన దారినే దర్జాగా తిరిగి వెళ్లిపోయింది. కర్ణాటకలో నాగర్‌హోల్‌ జాతీయ పార్క్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. దీన్నంతటినీ ట్రక్కులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు జంకుతున్నారు. ఏనుగు దాడి తర్వాత దెబ్బతిన్న ట్రక్‌ ఫొటోను చూసి ఆ ఏనుగుకు అంత కోపం ఎందుకొచ్చిందబ్బా అని ఎవరికి వారే ఆలోచనలు చేస్తున్నారు. ట్రక్కు స్థానంలో మనుషులు ఉంటే ఆ ఏనుగు ఇంకేం చేసేదోనని నెటిజన్లు ఒకింత భయపడుతూనే కామెంట్లు చేస్తున్నారు.


ఏనుగు చేతిలో చిత్తయిన ట్రక్కు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top