ఉసురు తీసిన అతివేగం...ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు

Truck Collided Autorickshaw In Uttar Pradesh 3 People Died - Sakshi

లక్నో: మితిమీరిన వేగంతో దూసుకు వస్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘనట ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

ట్రక్‌ అతి వేగంతో ఆటోని ఢీకొట్టి, అక్కడే ఉన్న డివైడర్‌ని, కరెంట్‌ స్థంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఐతే ఆ ఆటోలోని ప్రయాణికులంతా విద్యాంచల్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటిక వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన క్షతగ్రాతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 

(చదవండి: భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top