భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా..

Madhya Pradesh Shooting-On-Dalit Family Three Dead - Sakshi

దామోహ్‌: తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దామోహ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేవ్‌రన్‌ గ్రామానికి చెందిన దళిత వ్యక్తి(32) తరచూ తన భార్య వైపు చూస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన జగ్‌దీశ్‌ పటేల్‌ ఆగ్రహంతో ఉన్నాడు. ఇదే కారణంతో మంగళవారం ఉదయం గ్రామానికే చెందిన మరికొందరితో కలిసి తుపాకీతో కాల్పులు జరిపాడు.

కాల్పుల్లో సదరు దళితుడు, అతని తల్లిదండ్రులు(60, 52) చనిపోగా సోదరులు (30, 28) గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు జగదీశ్‌ పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్‌పీ డీఆర్‌ తేనివార్‌ చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.
చదవండి: టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top