పుణె: మహారాష్ట్రలో ట్రక్ బీభత్సం సృష్టించిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. గురువారం సాయంత్రం పూణే – బెంగళూరు హైవే నవలే బ్రిడ్జ్ సమీపంలో సెల్ఫీ పాయింట్ వద్ద ట్రక్ అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న వాహనాల్ని ఢీకొట్టడంతో మంటలు అంటుకుని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆరుపైగా వాహనాలు దగ్ఘమయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను సరిచేసే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
महाराष्ट्र –
पुणे में ट्रक के ब्रेक फेल होने से करीब 25 गाड़ियां आपस में टकराईं। कई वाहनों में आग लगी। 9 लोगों की मौत हुई।@YashAhmad8 pic.twitter.com/Gtz1nhHa64— Sachin Gupta (@SachinGuptaUP) November 13, 2025


