స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు మృతి

Chhattisgarh Road Accident Truck Hits Auto Several Students Dead - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ కంకేర్ జిల్లా కోరార్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషాద ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని  హామీ ఇచ్చారు.
చదవండి: Cow Hug Day On Valentines Day: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top