బస్సు ట్రక్కు ఢీ .. 31 మంది దుర్మరణం | Road Accident in Pakistan Punjab Province | Sakshi
Sakshi News home page

Pakistan: బస్సు ట్రక్కు ఢీ .. 31 మంది దుర్మరణం

Jul 20 2021 6:12 AM | Updated on Jul 20 2021 9:49 AM

Road Accident in Pakistan Punjab Province - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌లో సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది చనిపోగా మరో 60 మంది గాయపడ్డారు. పంజాబ్‌ ప్రావిన్సులోని ఇండస్‌ హైవేపై  సియాల్‌కోట్‌ నుంచి రాజన్‌పూర్‌ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని అత్యధికులు బుధవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే 18 మంది మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు పాక్‌ సమాచార ప్రసార మంత్రి ఫవాద్‌ చౌధరీ ఓ సంతాప ట్వీట్‌ చేశారు. ప్రజావాహనాలను నడిపేవారు జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా అత్యవసర విధుల అధికారి డాక్టర్‌ నయ్యర్‌ ఆలం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement