ఫంక్షన్‌ నుంచి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది.. | Sakshi
Sakshi News home page

ఫంక్షన్‌ నుంచి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది..

Published Fri, Feb 24 2023 10:20 AM

Chhattisgarh Baloda Bazar Road Accident Many People Died - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బలోదా బజార్ జిల్లా ఖమారియా గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో వీరిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల సిఫార్సు మేరకు క్షతగాత్రుల్లో కొందరిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

పికప్ వాహనంలో ఉన్నవారంతా ఓ పంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అసరమైన సాయం  అందించాలని సూచించారు.

రెండు వారాల క్రితం కంకేర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరొక చిన్నారితో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!

Advertisement
 
Advertisement
 
Advertisement