స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్కుపై 'శక్తిమాన్‌' స్టైల్‌లో ఫీట్లు.. పట్టుతప్పటంతో..! | Sakshi
Sakshi News home page

కదులుతున్న ట్రక్కుపై సూపర్‌ హీరోలా ఫీట్లు.. వీడియో వైరల్‌

Published Sun, Jul 17 2022 9:15 PM

UP Man is Seen Doing Push Ups on Top of a Moving Truck Viral - Sakshi

లక్నో: రోడ్డుపై వేగంగా వెళ్తున్న చెత్త తీసుకెళ్లే ట్రక్కుపై ఓ వ్యక్తి పుషప్స్‌ చేస్తూ సూపర్‌ హీరోలా రెచ్చిపోయాడు. ట్రక్కుపై ఎలాంటి ఆధారంలేకుండా నిలబడి పోజులిచ్చాడు. కొద్ది సేపటికే పట్టు కోల్పోయి.. కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో కుయ్యో ముర్రో అంటూ మూలుగుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. 

ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు సీనియర్‌ పోలీస్‌ అధికారి శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్‌లా కాదు.. బుద్ధిమాన్‌లా ఉండు అంటూ ట్యాగ్‌ జత చేశారు. ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ట్రక్కుపై నుంచి కిందపడిపోవటం వల్ల ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భుజాలు, కాళ్లు, వీపుపై గాయాలతో బెడ్‌పై పడుకున్న దృశ్యాలు సైతం ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.  

'అతడు శక్తిమాన్‌లా మారేందుకు ప్రయత్నించాడు. కానీ, బొక్కబోర్లాపడి కనీసం కూర్చోలేకపోతున్నాడు. దయచేసి అలాంటి ప్రమాదకర స్టంట్లు చేయవద్దు.' అంటూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు అదనపు డిప్యూటీ కమిషనర్‌ శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్‌ సూపర్‌ హిట్‌ సూపర్‌ హీరో టీవీ షో. అది 1997 నుంచి 2005 వరకు డీడీ నేషనల్‌ ఛానల్‌లో ప్రసారమైంది. శక్తిమాన్‌గా ముకేశ్‌ ఖన్నా అభిమానులను మెప్పించారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!

Advertisement
 
Advertisement
 
Advertisement