 
													Karnataka Farmer Was Humiliated At Mahindra Car Showroomఒక మనిషి ఆహార్యాన్ని బట్టి లేదా వేషధారణ చూసో తక్కువగా అంచనా వేయకూడదు. కొంతమంది ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడటమే కాక అవమానించాలనుకుంటారు. నిజానికి ఆ విధంగా చేస్తున్న వాళ్లే అందరిలోనూ నవ్వులు పాలవ్వడమే కాక క్షమాపణ కోరే పరిస్థితిని తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే..కర్ణాటకలో తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌కి కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. ఆ రైతు ఆ షోరూమ్‌లోని సేల్స్‌మేన్ చేత అవమానింపబడ్డాడు. అతని వేషధారణ చూసిన సేల్స్‌మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని వెటకారంగా చెప్పాడు. పైగా నీ జేబులో కనీసం రూ. 10 కూడా ఉండకపోవచ్చు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కెంపె గౌడని చాలా అవమానించి మాట్లాడాడు.
Karnataka farmer's sweet revenge on the Mahindra showroom: దీంతో ఆ సేల్స్‌మేన్‌కి రైతు కెంపెగౌడకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువస్తే గనుక నువ్వు ఎస్‌యూవీ కారుని ఈ రోజే డెలివరీ చేయాలి" అని సేల్స్‌మేన్‌కి ఒక చాలెంజ్ కూడా విసిరాడు. ఈ క్రమంలో రైతు సినిమాలోని హీరో మాదిరిగా ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువచ్చి సేల్స్‌మేన్‌కి చూపించాడు. దీంతో సేల్స్‌మేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ సేల్స్‌మేన్ వెంటనే డెలీవరీ చేయడంలో విఫలమయ్యాడు, ఎందుకంటే వెయిటింగ్ లిస్టింగ్ ఉంటుంది కదా.
దీంతో రైతు కెంపెగౌడ ఒక్కసారిగా ఆ సేల్స్‌మేన్ పై మండిపడటమే కాక అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకు ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ వీడియోని విస్తృతంగా ట్వీట్ చేశారు.
(చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
