కారుపై ప‌డ్డ కంటైన‌ర్‌: న‌లుగురు దుర్మరణం | Rajasthan: A container fell on the car, 4 died | Sakshi
Sakshi News home page

కారుపై ప‌డ్డ కంటైన‌ర్‌: న‌లుగురు దుర్మరణం

Apr 2 2021 3:39 PM | Updated on Apr 2 2021 5:54 PM

Rajasthan: A container fell on the car, 4 died - Sakshi

జైపూర్‌: రాజ‌స్థాన్ పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది.పాల‌రాతి లోడ్‌తో వెళుతున్న కంటైన‌ర్ కారుపై  పడడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవర్‌తో సహా న‌లుగురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. గుడా ఆండ్లా పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం  ఈ విషాదంచోటు  చేసుకుంది. (ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి)

స్థానికులసమాచారం  ప్రకారం పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ పడింది.  ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో వేరు చేశారు. దీంతో కారులో ఉన్న‌ దంప‌తుల‌తో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని అజ్మీర్ మెడికల్ కాలేజీకి ఆర్థిక సలహాదారుగా మనోజ్ కుమార్ శర్మగా గుర్తించారు. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.  అతి కష్టంమీద మృత‌దేహాల‌ను వెలికితీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం గుండోజ్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  అటు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్‌, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement