Indian-Origin Teen Held For Trying To Kill US President Joe Biden, Had Nazi Flag On Crashed Truck - Sakshi
Sakshi News home page

జోబైడెన్‌ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడి

May 24 2023 8:14 AM | Updated on May 24 2023 12:58 PM

Man Arrested For Trying To Kill Joe Biden Had Nazi Flag In Crashed Truck - Sakshi

ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది.  ఆ యువకుడు వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్‌ పోలీసులు అతను లాఫాయోట్‌ పార్క్‌ వెలుపల ఉన్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్‌ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్‌ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్‌ డ్రైవింగ్‌, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు.

(చదవండి:  నమ్మకమే పునాది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement