దేశవ్యాప్తంగా పెరిగిన ట్రక్‌ అద్దెలు  | Truck Rentals Surge in January 2025 | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పెరిగిన ట్రక్‌ అద్దెలు 

Feb 8 2025 6:12 AM | Updated on Feb 8 2025 6:12 AM

Truck Rentals Surge in January 2025

జనవరిలో మెరుగైన రికవరీ 

శ్రీరామ్‌ ఫైనాన్స్‌ బులెటిన్‌ వెల్లడి 

ముంబై: దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ట్రక్‌ల అద్దెలు జనవరిలో గణనీయంగా కోలుకున్నాయి. శీతాకాలంలో పండ్లు, కూరగాయల దిగుబడులు ఇందుకు మద్దతుగా నిలిచాయి. కొన్ని మార్గాల్లో ట్రక్‌ల అద్దెలు 2024 డిసెంబర్‌తో పోలి్చతే జనవరిలో 4 శాతం వరకు పెరిగినట్టు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నెలవారీ బులెటిన్‌ వెల్లడించింది. ‘‘సాధారణంగా జనవరి–మార్చి కాలం రద్దీగా ఉంటుంది. రబీ పంట తర్వాత వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పలు రంగాల్లోనూ తయారీ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి’’అని శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. 

వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, వ్యవసాయ ట్రైలర్ల అమ్మకాలు గత నెలలో గణనీయంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఢిల్లీ–ముంబై–ఢిల్లీ మార్గంలో ట్రక్‌ల అద్దెల ధరలు 4 శాతం పెరిగాయి. ముంబై–కోల్‌కతా–ముంబై మార్గంలో 3.7 శాతం మేర ధరలు అధికమయ్యాయి. ఢిల్లీ–హైదరాబాద్‌–ఢిల్లీ మార్గం, కోల్‌కతా–గువహటి–కోల్‌కతా మార్గంలో అద్దెలు 3.3 శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ‘‘లాజిస్టిక్స్‌ రంగంలో ట్రక్‌ల అద్దె రేట్లు పెరగడం సానుకూల సంకేతం. శీతాకాల పండ్లు, కూరగాయల దిగుబడులతో రవాణా, స్టోరేజీ వసతులకు డిమాండ్‌ పెరిగింది’’అని శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈవో వైఎస్‌ చక్రవర్తి తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement