
జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్‌లో రైలు ప్రమాదం(Train accident) చోటుచేసుకుంది. జల్గావ్ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోధుమల బస్తాలతో నిండిన ఒక ట్రక్కు కాపలా లేని రైల్వే గేటును ఢీకొని, పట్టాలపైకి చేరుకుంది. ఇంతలో అదే ట్రక్‌పైకి అంబా ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చింది. అది ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో టక్కు తునాతునకలయ్యింది. ఆ ట్రక్కులోని కొంతభాగం రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అయితే రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో మధ్య రైల్వేకు చెందిన ముంబై-కోల్‌కతా మార్గం(Mumbai-Kolkata route)లోని ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైరు తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం ఈ మార్గంలో మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు డ్రైవర్ రైల్వే నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నం చేశాడు. ఫలితంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.
ఇది కూడా చదవండి: Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ..
Comments
Please login to add a commentAdd a comment