
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి, పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన కరోలీబాగ్‌లోని ఆమ్రపాలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ రోడ్డు ప్రమాదం జరిగిన దరిమిలా జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటాన్ని స్ణానికులు గుమనించారు. అతను గట్టిగా అరుస్తూ కారు నడిపాడని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం కారు దిగిన ఆ యువకుడు ‘అనెదర్ రౌండ్’ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీసీపీ పన్నా మోయాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిందని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిని వారణాసికి చెందిన రవీష్ చౌరాసియాగా గుర్తించామన్నారు. రవీష్ లా చదువుకుంటున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితులకు కూడా అతనితో పాటు ఉన్నారని, ఆ తరువాత పరారయ్యారన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు(Police teams) గాలిస్తున్నాయన్నారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment